బాబోయ్ ఏంటి వీళ్ళు..బుల్లితెర నటులా చిల్లర ఏరుకునే వాళ్ళా
on Jun 27, 2025
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఆదివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇది కూడా బోనాల్ స్పెషల్ గా రాబోతోంది. దాంతో షోకి వచ్చిన వాళ్లంతా హోమ్లీ కాస్ట్యూమ్స్ తో వచ్చారు. శోభా శెట్టి, ప్రేరణ, అంబటి అర్జున్, కావ్య శ్రీ, శివ్, ప్రియాంక జైన్ ఇలా చాలా మంది టీవీ ఆర్టిస్టులు వచ్చారు. శ్రీముఖి ఒక ముంత తీసుకొచ్చి దీన్ని కింద పడేస్తే ఆ ఊరోళ్లు, ఈ ఊరోళ్లు ఎవరు చిల్లర ఏరుకుంటారో చూస్తా అంటూ ఒక టాస్క్ అనౌన్స్ చేసింది. వెంటనే శ్రీముఖి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ముంతను కిందపడేసి రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ పడేయకుండా అందరినీ వెంట తిప్పుకుంది.
అంబటి అర్జున్ టీమ్ వెంటనే చిల్లర ఏరుకోవడానికి వచ్చేసరికి ఇమ్మానుయేల్ వచ్చి వాళ్ళ టీమ్ చిల్లగాళ్ళని చెప్పానా అంటూ కౌంటర్ వేసాడు. ఫైనల్ గా లేడీస్ ని తన వెంట తిప్పుకున్న శ్రీముఖి ఆ ముంతను కింద పడేసింది. దాంతో శోభా శెట్టి, ప్రేరణ ఐతే చిల్లర ఏరుకున్న తీరు చూసి ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. "ప్రేరణకు చిల్లర ఏరుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉంది.. నాకు ఈ ఆట చూసాక అర్ధమయ్యింది..నార్మల్ పర్సన్స్ ఎవరూ కూడా ఇలా చిల్లర ఏరరు " అన్నాడు ఇమ్మానుయేల్. "ప్రేరణ, శోభా మాత్రం జీవితం ఈ చిల్లర ఏరడమే వాళ్ళ గోల్" అన్నట్టుగా ఏరుకున్నారు అంటూ శ్రీముఖి చెప్పింది. "అసలు ఈ చిల్లరే వాళ్ళ పేమెంట్ లా బిహేవ్ చేశారు" అని మళ్ళీ కౌంటర్ పేల్చాడు ఇమ్ము. దాంతో శోభా ముఖం మూసుకుని తెగ నవ్వుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



